వడ్ల తరలింపు ఆలస్యంపై రైతుల ధర్నా

వడ్ల తరలింపు ఆలస్యంపై రైతుల ధర్నా

కోనరావుపేట, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో వడ్ల తరలింపులో ఆలస్యం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో వడ్ల బస్తాలను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సకాలంలో లారీలు రాకపోవడంతో వడ్ల తరలింపు ఆలస్యం అవుతోందని, లారీలను త్వరగా తీసుకొచ్చి వడ్లను తరలించాలని కోరినా ఆఫీసర్లు స్పందించడం లేదని ఆరోపించారు. కలెక్టర్‌‌‌‌ స్పందించి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్లను వెంట వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.