వడ్ల పైసలు పడ్తలేవ్

వడ్ల పైసలు పడ్తలేవ్
  • కొనాల్సింది 5 లక్షల టన్నులు..
  • కొన్నది 3.15 లక్షల టన్నులే
  • పైసలు సరిగా ఇస్తలే
  • ఇచ్చింది 237 కోట్లు 
  • 413 కోట్లు పెండింగ్​ 
  • పేమెంట్​ కోసం 19 వేల మంది ఎదురుచూపు

యాదాద్రి, వెలుగు : ఈ యాసంగి సీజన్ లో వడ్లు కొన్నదే తక్కువ.. కొన్నవాటికి కూడా సర్కారు సరిగా పైసలిస్తలేదు. పైసల కోసం19 వేల మందికి పైగా రైతులు ఎదురు చూస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో కేవలం రూ. 9 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. 

వడ్లు కొన్నది తక్కువే

2022–23 యాసంగిలో జిల్లాలో 3  లక్షల ఎకరాల్లో సాగు చేయగా 6 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచానా వేశారు. అయితే  దళారులు సుమారు లక్ష టన్నుల వరకూ కొనుగోలు చేసే అవకాశమున్నదని భావించిన సివిల్ సప్లయ్​5 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. వరి కోతలు ముమ్మురంగా జరిగినా.. సెంటర్ల ఏర్పాటు విషయంలో ఆఫీసర్లు ఆలస్యంగా స్పందించారు. విడతల వారీగా జిల్లా వ్యాప్తంగా 324 సెంటర్లు ఏర్పాటు చేశారు. అకాల వర్షాలుకురియడం, తేమ, తాలు అంటూ మిల్లర్ల కొర్రీల కారణంగా కొనుగోళ్లు స్లోగా జరిగాయి. సెంటర్లు ఓపెన్​ చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ 3.15 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిల్లర్ల కొర్రీల కారణంగా విసిగిపోయిన రైతులు.. పైసలు తక్కువగా వచ్చినా సరే..అనుకొని మధ్య దళారులకు  సుమారు 1.50 టన్నుల వడ్లను అమ్మేసుకున్నారని తెలుస్తోంది. 

 23 రోజులైంది పైసలు రాలే-  నర్సింహ, రైతు

చౌటుప్పల్ ఐకేపీ సెంటర్లు లో మే 19న 15 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. మరుసటి రోజు నా ఫోన్​కు ఓటీపీ వచ్చింది. 23 రోజులు గడిచాయి.  ఇప్పటివరకు వడ్ల పైసలు నా ఖాతాలో జమ చేయలే.  

Also Read:ఇండియాస్ టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే.. టాప్లో సాక్ర్‌డ్‌ గేమ్స్‌

పైసలు సరిగా పడ్తలే

ఎదురు చూస్తున్న 19 వేల మంది రైతులువడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బంది పెట్టిన సర్కారు.. పైసలను జమ చేయడంలోనూ అదేరీతిలో వ్యవహరిస్తోంది. నెలక్రితం కొనుగోలు చేసన వడ్లకు కూడా పైసలు సరిగా వేయడం లేదు. జిల్లాలోని 35 వేల మంది రైతుల వద్ద 3.15 లక్షల టన్నుల వడ్లు సివిల్​ సప్లయ్​ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసిన వడ్లకు రూ. 650 కోట్లు అవుతోంది. వీటిలో ఇప్పటివరకూ 16 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 237 కోట్లను సివిల్​ సప్లయ్​ జమ చేసింది. ఇంకా 19 వేల మందికి రూ. 413 కోట్లు చెల్లించాల్సి ఉంది