రేవల్లి/ఏదుల, వెలుగు: ఏదుల మండలంలో ప్రతిపాదించిన గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దని అఖిలపక్ష నాయకులు, రైతులు డిమాండ్చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఆదర్శ్సురభికి వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్ నిర్మిస్తే సుమారు 1,200 ఎకరాల సాగు భూమి నీటమునుగుతుందన్నారు. దీనివల్ల వందలాది రైతు కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోయి నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్హయాంలో ప్రజాప్రతినిధులు ఈ రిజర్వాయర్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అప్పట్లో పక్కన పెట్టిన ఈ అంశాన్ని ఇప్పుడు మళ్లీ తెర మీదకు తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
