మాస్టర్ ప్లాన్పై ఆగని ఆందోళనలు..ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన

మాస్టర్ ప్లాన్పై ఆగని ఆందోళనలు..ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన

జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ పై ఆందోళన కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ నర్సింగాపూర్ మహిళా రైతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తమ భూములను తీసుకోవద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అండగా ఉంటానని..  ఒక్క గుంట భూమి కూడా పోనివ్వబోనని ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ నుంచి రైతుల భూములను తొలగిస్తామని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ సోమవారం జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్  గ్రామ పాలకవర్గం రాజీనామా చేసింది.  తిమ్మాపూర్ సర్పంచ్ మెరుగు రమ్య (కాంగ్రెస్), ఉప సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి(బీఆర్ఎస్) తో సహా ఎనిమిది మంది వార్డు మెంబర్ల రాజీనామాలు చేశారు. మరోవైపు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ(AMC) డైరెక్టర్ దుమాల రాజేష్ కూడా రాజీనామా చేశారు. 

నూతన మాస్టర్‌ ప్లాన్‌లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసాయ భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్‌ జోన్‌, సెమీ పబ్లిక్‌ జోన్‌లుగా ముసాయిదా రూపొందించిన విషయం తెలిసిందే.