V6 News

మక్కలు కొనుగోలు చేయాలి..కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతుల రాస్తారోకో

మక్కలు కొనుగోలు చేయాలి..కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతుల రాస్తారోకో

తాడ్వాయి, వెలుగు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో భారతీయ కిసాన్  సంఘ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై గంటల తరబడి నిరసన తెలపడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కామారెడ్డి జిల్లాలో ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. యూరియా పంపిణీలో ఓటీపీ సిస్టం పెట్టడం వల్ల చాలా మంది రైతులు అవగాహన లేక నష్టపోతున్నారని తెలిపారు. టెక్నాలజీ లేకపోవడంతో యూరియా తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. జాగృతి మండల అధ్యక్షుడు భుజంగరావు, రైతులు రాజిరెడ్డి, పీసు రాజిరెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు పాల్గొన్నారు.