దుబ్బాక మండలంలో యూరియా కోసం రైతుల తిప్పలు

దుబ్బాక మండలంలో యూరియా కోసం రైతుల తిప్పలు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్​ గ్రామ ఫర్టిలైజర్​ షాపు వద్ద శుక్రవారం ఉదయం నుంచే పెద్దగుండవెళ్లి, అప్పనపల్లి, హసన్​ మీరాపూర్​, పద్మనాభునిపల్లి, మర్రి కుంట, మిరుదొడ్డి మండలం కొండాపూర్​, ధర్మారం, సిద్దిపేట రూరల్​ మండలం తోర్నాల గ్రామాల రైతులు యూరియా కోసం క్యూ లైన్​లో నిలబడ్డారు.

 గంటల తరబడి నిలబడితే కేవలం రెండు బస్తాలే దొరుకుతున్నాయని, మిగతా వాటి కోసం ఎక్కడికెళ్లాలని వాపోతున్నారు. సాగుకు సరిపడా యూరియా బస్తాలను అందజేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.