పేపర్ రాకెట్‌‌తో గిన్నీస్ రికార్డు సృష్టించాడు.. వీడియో

పేపర్ రాకెట్‌‌తో గిన్నీస్ రికార్డు సృష్టించాడు.. వీడియో

రాకెట్‌‌ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పేపర్‌‌తో రాకెట్‌‌లు చేసి.. చిన్నప్పుడు సరదాగా ఆడుతుండే వారు. అంతేగాకుండా.. ఇతరులపైకి విసురుతూ... సరదగా ఆటపట్టించే వాళ్లు. ఎవరు ఎంత పైకి ఎగురవేస్తారో.. ఎంత దూరం వేస్తారో అన్న పోటీ సైతం పెట్టుకొనే వాళ్లు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ఎవరూ ఎగురవేయనంత దూరం వేసి రికార్డు సృష్టించాడు. అట్లాంటి.. ఇట్లాంటి రికార్డు కాదు. ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డు (guinness world records) సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 
 


వివరాల్లోకి వెళితే...

దక్షిణ కొరియాలో నివాసం ఉండే కిమ్ క్యుటే పేపర్‌‌ రాకెట్ (Paper Plane Rocket) విసరడంలో నేర్పరి. ఈ మేరకు ప్రాక్టీస్ చేస్తుండే వాడు. ఓ రోజు గిన్నీస్ రికార్డు ప్రతినిధులు పేపర్ రాకెట్ విసిరేందుకు ఏర్పాట్లు చేశారు. కిమ్ క్యు బే విసిరిన పేపర్ రాకెట్ గాల్లో దూసుకెళ్లి.. ఓ చోట పడిపోయింది. విసిరిన స్థలం నుంచి పడిన చోటు వరకు లెక్కించగా.. సుమారు 77.134 మీటర్లు (252 అడుగుల 7 అంగుళాలు) దూరం ప్రయాణించినట్లు లెక్కకట్టారు. గతంలో రికార్డులను పరిశీలించగా.. 2012లో అమెరికన్ క్వార్టర్ బ్యాక్ జో అయోబ్ తో పాటు ఎయిర్ ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ లు 69.14 (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించి రికార్డు నెలకొల్పారని ఉంది. ఈ రికార్డును కిమ్ క్యుటే బద్దలు కొట్టారని గిన్నీస్ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. సరికొత్త రికార్డును తిరగరాశాడాని తెలిపారు. తన స్నేహితుల సహాయంతో ఈ రికార్డును సృష్టించగలిగానని కిమ్ చెప్పాడు. రాకెట్ విసిరిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. 

మరిన్ని వార్తల కోసం : -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే..మరో రెండు దేశాల్లో మంకీపాక్స్ కేసులు