మరో రెండు దేశాల్లో మంకీపాక్స్ కేసులు

మరో రెండు దేశాల్లో మంకీపాక్స్ కేసులు

కరోనా కల్లోలం నుంచి తేరుకోకముందే ప్రపంచ దేశాలకు ఇప్పుడు మంకీ పాక్స్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ లలో తొలి కేసు నమోదైనట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్గా తేలింది. ఇజ్రాయెల్ రాజధాని తెల్ అవీవ్లోని ఓ హాస్పిటల్లో బాధితునికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. మరోవైపు స్విట్జర్లాండ్లోనూ ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్థారణ కాగా.. అతని కాంటాక్ట్లోకి వచ్చిన వ్యక్తులందరికీ టెస్టులు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. మరో 50 మంది అనుమానితుల లిస్టులో ఉన్నారని చెప్పింది. తొలుత ఈ జబ్బును మధ్య, పశ్చిమాఫ్రికా దేశాల్లో గుర్తించగా.. ఆ తర్వాత బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, అమెరికా, స్వీడన్, కెనడా, జర్మనీ బెల్జియం, ఆస్ట్రేలియాల్లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి. 

మరిన్ని వార్తల కోసం..

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు..ఎలానో తెలుసా? 

బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం