డెబ్బై ఏండ్లంటే ఇంటి పట్టున ఉండి ‘క్రిష్ణా, రామా’ అనుకుంటూ కూర్చోవడం అనుకుంటారు చాలామంది. కానీ జీవితాన్ని ఆస్వాదించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఈ బామ్మలు. బీజింగ్ నగరంలో ఇప్పుడు ‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’ పేరుతో పాపులారిటీ తెచ్చుకున్నారు. 70 ఏండ్ల వయసులో సంప్రదాయ దుస్తులు ధరించి, క్యాట్ వాక్ చేసి గ్లామర్ బామ్మలుగా పేరు తెచ్చుకున్నారు. వీడియో క్లిప్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లతో మిలియన్ల అభిమానులను సొంతం చేసుకున్నారు. ‘ముసలితనానికి ఎవరూ భయపడొద్దు’ అనే మెసేజ్‌ను ఇవ్వడానికి ఈ ‘ఫ్యాషన్ గ్రాండ్‌మాస్’ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది . ఈ గ్రూప్‌లో 23 మంది ఉన్నారు.
