
ఫిబ్రవరి 17 నుంచి FASTag కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. వినియోగదారులు కొత్త రూల్స్ గురించి తెలుసుకోకపోతే జేబులకు చిల్లు పడకతప్పదు. అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. FASTag కొత్త రూల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలను మార్చింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ లో బ్యాలెన్స్ కు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఇవి కస్టమర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. హైవేపై టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లింపుల్లో కష్టాలు తప్పవు. డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
Also Read :- మార్చి 31 పండగ రోజైనా.. బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకంటే
ఫాస్టాగ్ ను సకాలంలో రీచార్జ్ చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతారు. దీంతో ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తప్పవు.. లేదంటే టోల్ ప్లాజా(Toll Plaza)ల దగ్గర ఎర్రర్ కోడ్ 176 చూపే చూపిస్తుంది. ఇది ఫాస్టాగ్ ద్వారా మీ టోల్ చెల్లింపులను తిరస్కరిస్తుంది. ఒక్కోసారి రెట్టింపు ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
FASTag కొత్త రూల్స్..
ఫాస్టాగ్ సిస్టమ్ తో వెహికల్స్ ను రెండు విధాలుగా వర్గీకరిస్తారు. వైల్ లిస్ట్ వెహికల్స్, బ్లాక్ లిస్ట్ వెహికల్స్..బ్యాలెన్స్ లేకపోవడం, KYC అప్డేషన్ పెండింగ్, ఛాసిస్ నంబర్ , వెహికల్స్ రిజిస్ట్రేషన్ నంబర్ సరిపోలకపోయినా బ్లాక్ లిస్టులో పెడతారు. NPCI ప్రకారం.. రెండు టైమ్‌లైన్‌లు ఉంటాయి. ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ టైమ్‌కి 60 నిమిషాల ముందు, రీడర్ టైమ్ తర్వాత 10 నిమిషాలు. ఈ లిమిట్ దాటితే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు.