ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.