
నల్లగొండ: పండుగ వేళ నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ దగ్గర ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు పోలీసులు. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు కాగా.. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.