
పొలానికి వెళ్లి తిరిగి వస్తూ తండ్రీకొడుకులిద్దరూ రోడ్డు ప్రమాదంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట బైపాస్ చౌరస్తా దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. షాద్ నగర్లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సల్ల పాండు అతడి కుమారుడు సల్ల వరుణ్ తేజ్ తో కలిసి స్కూటీపై పాల కోసం పొలానికి వెళ్లారు. అక్కడ పాలు తీసుకుని తిరిగి వస్తుండగా.. కేశంపేట బైపాస్ చౌరస్తా దగ్గర వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాండు, వరుణ్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తండ్రీకొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్.