దారుణం : తల్లి సపోర్ట్ తోనే కూతురిపై తండ్రి అత్యాచారం

దారుణం : తల్లి సపోర్ట్ తోనే కూతురిపై తండ్రి అత్యాచారం

రేప్ కేసుల్లో నింధితులకు ఉరి శిక్షలు పడుతున్నప్పటికీ కామాంధుల తీరు మాత్రం మారడంలేదు. వాయివరుస మరిచి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. లేటెస్ట్ గా యూపీలో జరిగిన అత్యాచార సంఘటన సభ్య సమా. సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అల్లారుముద్దుగా పెంచి ,,మంచి చదువు చదివించి పెళ్లి చేయాల్సిన తండ్రే..కూతురిపై అత్యాచారం చేశాడు. మృగంలా ప్రవర్తిస్తున్న ఆ తండ్రికి తోడు తల్లి కూడా సహకరించడంతో ..బాలిక బాధ ఆ దేవుడికే తెలుసు.

15 ఏళ్లుగా కూతురి(22) పై తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.  కళ్లముందే ఇంత ఘోరం జరుగుతున్నా ఆపకుండా..భర్తకే మద్దతిచ్చిన తల్లి..  కూతురికి గర్భం రాకుండా గర్భ నిరోధక మాత్రలు వేసేది. 22 ఏళ్ల ఓ మహిళ లక్నో శివారులోని చిన్‌ హాట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమెపై సొంత తండ్రే దశాబ్ధ కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తల్లి కూడా అతడికి సహకరించడంతో బాధితురాలు ఒంటరిదైపోయింది. మౌనంగా ఏడుస్తూ 15 ఏళ్లుగా సొంతింట్లోనే నరకయాతన అనుభవిస్తోంది.

అయితే ఇటీవల చిన్న కూతురిపై కూడా ఆ కామాంధుడి కన్ను పడింది. తనలాగే తన చెల్లి జీవితం నాశనమైపోతుందన్న భయంతో ఇన్నాళ్లకు ఆమె బయటకొచ్చి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె తల్లిదండ్రులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వారికి ఉరిశిక్ష కాదు..జీవితాంతం నరకయాతన అనుభవించేలా కాళ్లు, చేతులు తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.