డీసీఎం ఢీకొని తండ్రి,కొడుకు మృతి..ఖమ్మం జిల్లా తల్లాడలో ఘటన

డీసీఎం ఢీకొని తండ్రి,కొడుకు మృతి..ఖమ్మం జిల్లా తల్లాడలో ఘటన

తల్లాడ వెలుగు : యాక్సిడెంట్ లో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఎస్ఐ కొండలరావు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు(28) తన అత్తారింటికి  తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామానికి బుధవారం సాయంత్రం కుటుంబంతో కలిసి వెళ్లాడు. గురువారం బావమరిది తిరుపతిరావును తన బైక్ పై తల్లాడలో దిగబెట్టేందుకు వెళ్తుండగా.. రాంబాబు కొడుకు క్రిశాంత్(7) కూడా వస్తాననడంతో  ముగ్గురూ వెళ్లారు.

తిరుపతిరావును బస్టాండ్ లో దింపి తండ్రి,కొడుకు తిరిగి రామచంద్రపురం వెళ్తుండగా ఎన్టీఆర్ కాలనీ దాటిన తర్వాత ఎదురుగా డీసీఎం వ్యాన్ వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో క్రిశాంత్ స్పాట్ లో చనిపోగా.. తీవ్రంగా గాయపడిన రాంబాబు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.  

భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని మహిళ..

భూపాలపల్లి జిల్లా, రూరల్ : టిప్పర్ ఢీకొని మహిళ చనిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన జిల్లల రాజమ్మ (65)  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ సిగ్నల్ పాయింట్ వద్ద గురువారం రోడ్డు దాటు తుండగా స్పీడ్ గా వచ్చిన టిప్పర్ ఆమెను ఢీకొట్టడడంతో స్పాట్ లో చనిపోయిం ది. కేసు నమోదు చేసిన పోలీసులు  టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.