
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన సొంత కొడుక్కి బుద్ధిచెప్పాడు ఓ తండ్రి. కొడుకు ప్రేమించి వదిలేసిన యువతిని మరో యువకుడితో పెండ్లి చేసి, తన పేరున ఉన్న ఆస్తిని కూడా ఆ యువతికి రాసిచ్చాడు. వివరాల్లోకి వెలితే..
కేరళ లోని కొట్టాయం జిల్లా తిరునక్కారం కు చెందిన షాజీ కుమారుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమ విషయం తండ్రి షాజీ కి తెలిసింది. అప్పటికీ వారు మైనర్లు కావడంతో మేజర్లయిన తర్వాత పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాడు షాజీ. వీళ్లు మేజర్లు అయ్యే లోపు షాజీ కొడుకు మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. దీంతో తన మొదటి ప్రియురాలు తనను పెళ్లి చేసుకోవాలని షాజీ కొడుకును కోరింది. ఇందుకు అతను ఒప్పుకోలేదు. షాజీ కూడా తన కొడుకుకు ఎంతగానో నచ్చ చెప్పాడు అయినా లాభం లేకపోయింది. ఇదే కాకుండా… రెండవ ప్రియురాలిని వదిలేసి మూడో అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు షాజీ కొడుకుకు. దీంతో కొడుకుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు షాజీ .
తన కొడుకు ప్రేమించి వదిలేసిన మొదటి అమ్మాయి తీవ్రంగా నష్టపోయిందని భావించిన షాజీ.. ఆమెకు మరో యువకునితో దగ్గరుండి పెళ్లి జరిపించాడు. అంతే కాకుండాజజ తన పేరుమీదున్న ఆస్తిని కూడా ఆఅమ్మాయికి రాసిచ్చాడు షాజీ. దీంతో పెళ్లికి వచ్చిన వారు షాజీ ఔన్యత్యాన్ని మెచ్చుకున్నారు.