కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న నాన్న ఏం చేశాడంటే

కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న నాన్న ఏం చేశాడంటే

కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడే నాన్న! నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం, నాన్న బాధ్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువే..! అలాంటి ఓ నాన్న క్యాన్సర్ తో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న కొడుకును ఎంటర్ టైన్ చేసే తీరు ప్రతీఒక్కరి హృదయాల్ని ద్రవించి వేస్తుంది.  కుక్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అమెరికా టెక్సాస్ లోని ఐడెన్ (14)ఏళ్ల బాలుడు కరోనా కారణంగా లింఫోసైటిక్ లుకేమియా అనే క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స కోసం కుక్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు అతని తల్లిదండ్రులు. పరిమితుల కారణంగా, కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ఒక పేరెంట్ మాత్రమే అతనితో గదిలో ఉండటానికి అనుమతిస్తారు. అందుకే తన కొడుకును ఎంటర్ టైన్ చేసేందుకు నాన్న చుక్ ఆస్పత్రి బయట రోడ్ మీద నుంచి డ్యాన్స్ వేస్తు కొడుకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు . రోడ్డు పై తండ్రి డ్యాన్స్ వేస్తుంటే ఆస్పత్రికి చెందిన నాలుగో ఫ్లోర్ కిటికీ నుంచి తండ్రి డ్యాన్స్ ను అనుకరిస్తూ ఐడెన్ డ్యాన్స్ చేయడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.