Health Tip : మీకు ఇష్టమైనవి తింటూనే.. ఇలా డైటింగ్ చేయొచ్చు

Health Tip : మీకు ఇష్టమైనవి తింటూనే.. ఇలా డైటింగ్ చేయొచ్చు

కొందరు డైటింగ్ లో ఉన్నామంటారు. కానీ, ఆకలికి ఆగలేక వెళ్లి ఏదోఒకటి తినేస్తారు. అలాంటివాళ్లు ఈ బ్రేక్ ఫాస్ట్ లు తింటే రోజు లో శరీరానికి కావాల్సిన ఎనర్జీ
వస్తుంది. కావాల్సిన న్యూట్రియెంట్స్ కూడా అందుతాయి. పొట్ట నిండుగా ఉంటుంది. దాంతో డైటింగ్ బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయొచ్చు.

  • ఇడ్లీలు ఈజీగా అరుగుతాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్స్ ఉంటాయి. 
  • ఇడ్లీల్లోని ఫైబర్ బరువు తగ్గడానికి సాయపడుతుంది. 
  • రవ్వ ఇడ్లీనే కాకుండా రాగులు, జొన్నలతో చేసిన ఇడ్లీలు హెల్త్ కి ఇంకా మంచివి.
  •  వెజిటబుల్ శాండ్విచ్ వల్ల కూడా బోలెడు లాభాలున్నాయి. 
  • మైదా బ్రెడ్ కాకుండా గోధుమ బ్రెడ్ శాండ్ విచ్ తింటే హెల్త్ మంచిది. 
  • కూరగాయలు, పనీర్తో చేసే ఈ శాండ్విచ్ లోని పోషకాలు శరీరానికి అందుతాయి.

       ALSO READ : క్లీన్ స్కిన్ కోసం ఒకే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారా..

  •  ఓట్స్... బ్రేక్ఫాస్ట్కి ఒక మంచి ఆప్షన్. ఇందులో ఐరన్, విటమిన్-బి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ ఉంటాయి. 
  • వట్టి ఓట్స్ తినడం ఇష్టంలేని వాళ్లు వాటిలో ఫ్రూట్స్ కలుపుకొని తినొచ్చు.
  •  పెసర దోశలో ప్రొటీన్, ఫైబర్ తో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచిది.
  •  పోహా (అటుకులు) బ్రేక్ఫాస్ట్ తింటే... కార్బోహైడ్రేట్స్, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ అన్నీ శరీరానికి అందుతాయి. 
  • దీన్ని కూరగాయలు వేసి వండితే హెల్త్ కి ఇంకా మంచిది.