కరోనా ట్రీట్మెంట్ కు ఈ మందు వాడొచ్చట!

కరోనా ట్రీట్మెంట్ కు ఈ మందు వాడొచ్చట!
  • మంచి ఫలితాలు ఇస్తుందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎఫ్ డీఏ
  • ఆశాజనక పరిస్థితి అంటూ ట్రంప్ కామెంట్లు

వాషింగ్టన్ : కరోనా ట్రీట్ మెంట్ కు సంబంధించి అమెరికా కొత్త మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమర్జెన్సీ మెడిసిన్ గా కరోనా పేషెంట్లకు రెమ్ డెసివిర్ ను ఇవ్వొచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ డీ ఏ తెలిపింది. కరోనా మొదలైన తర్వాత క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయిన ఫస్ట్ మెడిసిన్ ఇది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఎమర్జెన్సీ యాంటీ వైరల్ ఇంజక్షన్లు వాడొచ్చని తెలిపింది. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని ఈ మందును తయారు చేసే గిలీడ్ సైన్సెస్ సంస్థ తెలిపింది. ఈ మందుకు అనుమతులివ్వటంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. గిలీడ్ సంస్థ సీఈఓ డానియెల్ ఓడేతో వైట్ హౌజ్ లో ట్రంప్ మాట్లాడారు. కరోనాతో ప్రాణపాయ స్థితిలోకి చేరకున్న వారికి ఇది దివ్యౌషధమని ఓడే తెలిపారు. ఈ మెడిసిన్ తో బాధితులు త్వరగా కోలుకుంటున్నారని అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ సంస్థ కూడా వెల్లడించింది. కరోనాపై పోరులో ఇది ఆశాజన స్థితి అని ట్రంప్ అన్నారు. కరోనా కు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ లు జరుగుతున్నాయి. రెమ్ డెసివిర్ వినియోగం తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారణ ఆయితే పూర్తి కరోనా నివారణకు పూర్తి స్థాయిలో ఈ మందు వాడుతామని అమెరికా తెలిపింది. రెమ్ డెసివిర్ ను ఎబోలా మరణాలను తగ్గించేందుకు ముందుగా తయారు చేశారు. కానీ పెద్ద ఎఫెక్ట్ గా పనిచేయలేదు. కరోనా నివారణలో మాత్రం ఆశాజనక ఫలితాలు ఉన్నట్లు భావిస్తున్నారు.