
న్యూఢిల్లీ: ఇండియాలోకి ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 9.34 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వచ్చాయి. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన ఎఫ్‌డీఐలతో పోలిస్తే 24.5 శాతం తగ్గాయి. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏడాది లెక్కన 13 శాతం పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరాయి.
2023–-24 జనవరి–-మార్చి క్వార్టర్‌లో ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ 12.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పూర్తి 2023-–24లో 44.42 బిలియన్ డాలర్లు వచ్చాయి.