15 శాతం పెరిగిన ఎఫ్డీఐలు

15 శాతం పెరిగిన ఎఫ్డీఐలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ మొదటి క్వార్టర్​లో భారత్​లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐ) విలువ 15 శాతం పెరిగి 18.62 బిలియన్​ డాలర్లకు చేరింది. టారిఫ్​ సమస్యలు ఉన్నప్పటికీ అమెరికా నుంచి పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి 5.61 బిలియన్​ డాలర్లకు చేరాయి. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్​లో ఎఫ్​డీఐల విలువ 16.17 బిలియన్​ డాలర్లుగా ఉంది. ఈ క్వార్టర్​లో అమెరికా 5.61 బిలియన్​ డాలర్ల పెట్టుబడులతో అతిపెద్ద ఎఫ్​డీఐ వనరుగా అవతరించింది. 

ఆ తర్వాత సింగపూర్​ (4.59 బిలియన్​ డాలర్లు), మారిషస్​ (2.08 బిలియన్​ డాలర్లు) ఉన్నాయి. ఈసారి కంప్యూటర్ సాఫ్ట్‌‌వేర్, హార్డ్‌‌వేర్​ (5.4 బిలియన్​ డాలర్లు) రంగాల్లో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి.  సర్వీసెస్​ (3.28 బిలియన్​ డాలర్లు), ఆటోమొబైల్​ (1.29 బిలియన్​ డాలర్లు), పునరుత్పాదక ఇంధనం (1.14 బిలియన్​ డాలర్లు) వంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగాయి. కర్ణాటక అత్యధికంగా 5.69 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. 

ఆ తర్వాత మహారాష్ట్ర (5.36 బిలియన్​ డాలర్లు), తమిళనాడు (2.67 బిలియన్​ డాలర్లు) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎఫ్‌‌డీఐ పాలసీని రూపొందించింది. చాలా రంగాల్లో ఆటోమేటిక్​ మార్గంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది.