లాక్ డౌన్ పొడిగిస్తారని సూరత్ లో మైగ్రెంట్ వర్కర్స్ ఆందోళన, రాళ్ల దాడి

లాక్ డౌన్ పొడిగిస్తారని సూరత్ లో మైగ్రెంట్ వర్కర్స్ ఆందోళన, రాళ్ల దాడి

సూరత్: కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ లో మైగ్రెంట్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. ఇళ్లకు వెళ్లేందుకు తమకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లను బ్లాక్ చేశారు. తోపుడు బండ్లకు నిప్పు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వలస కూలీలు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ” తమను ఇళ్లకు పంపాలంటూ శుక్రవారం రాత్రి వలస కూలీలు రోడ్లను బ్లాక్ చేసి ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. అందర్నీ అదుపులోకి తీసుకున్నాం”అని సూరత్ డీసీపీ రాకేశ్ బరోట్ చెప్పారు.