ముంబై: స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగాన్ని కొనుగోలు చేస్తామని ఫెడరల్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా 4.5 లక్షల క్రెడిట్ కార్డులను దక్కించుకోనుంది. ఫెడరల్ బ్యాంక్ వద్ద ఇప్పటికే 8 లక్షల నాన్–-కో–-బ్రాండెడ్ కార్డులు, 13 లక్షల కో–-బ్రాండెడ్ కార్డులు ఉన్నాయి.
ఈ డీల్ తర్వాత నాన్-–కో-బ్రాండెడ్ కార్డుల నుంచి అందే పేమెంట్స్ దాదాపు 80శాతం పెరుగుతాయి. ఈ ఏడాదే డీల్ పూర్తవుతుంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల సంఖ్యపై డీల్ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని ఫెడరల్ బ్యాంక్ ఎండీ కేవీఎస్ మణియన్ తెలిపారు. ‘‘ఈ పోర్ట్‌ఫోలియో క్వాలిటీ ఉన్న, యాక్టివ్ యూజర్లది.
ఇది మా కార్డుల బిజినెస్ గ్రోత్‌ను వేగవంతం చేస్తుంది” అని అన్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య మాట్లాడుతూ, “మేము మల్టీ-ప్రొడక్ట్ రిలేషన్‌షిప్‌లపై దృష్టి పెడుతున్నాం. ఇందులో భాగంగా ధనవంతులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తాం” అని వివరించారు.

