మగాళ్లకూ ‘ఫెర్టిలిటీ సెంటర్లు’.. మారిన లైఫ్‌స్టైలే కారణం

V6 Velugu Posted on Jan 11, 2021

మారిన లైఫ్​స్టైల్, ఇతర కారణాలతో సంతానలేమి సమస్యలు

కొత్తగా పెళ్లవుతున్న వారిలో 30 శాతం వరకు సమస్యలు

సాధారణ ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లేందుకు మొహమాటం

అందుకే ఆండ్రాలజిస్టులతో మగవాళ్ల కోసం ప్రత్యేకంగా సెంటర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మారిన లైఫ్​స్టైల్​తో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒబేసిటీ, నిద్ర లేమి, ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మోకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఎన్నో కారణాలతో కపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్​ వస్తున్నాయి. ఒకప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాళ్లలోనే సమస్య ఉందని భావించేవాళ్లు. వారికే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పించేవాళ్లు. అందుకే ఎక్కడ చూసినా ఫీమేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సెంటర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఒపీనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారింది. సంతాన సమస్యలకు మగవాళ్లలోని లోపాలు కూడా కారణమనే అవగాహన పెరిగింది. భార్యభర్త ఇద్దరూ కలిసి ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్తున్నారు. వాటిల్లో గైనకాలజిస్టులతో అన్ని విషయాలు చెప్పుకునేందుకు చాలా మంది మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో  మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ‘మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సెంటర్లు’ స్టార్టయ్యాయి. ఆండ్రాలజిస్టులు, ఇతర డాక్టర్ల టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మగవాళ్లకు ట్రీట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది.

మగవాళ్లలో పెరుగుతున్న ఇన్​ ఫెర్టిలిటీ

పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతున్న మగవాళ్ల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో వచ్చిన మార్పులు దీనికి కారణమవుతున్నాయి. ఒకసర్వే ప్రకారం పెళ్లయిన జంటల్లో 15 నుంచి 20 శాతం వరకు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో మహిళల్లో 40 శాతం వరకు సమస్యలు ఉంటే.. మగవాళ్లలో కూడా 30 శాతం నుంచి 40 శాతం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెర్టిలిటీ సమస్య ఉంటోంది. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో) అయితే ఇండియాలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సమస్యలకు 50 శాతం వరకు మగవాళ్లలో లోపాలే కారణమని తేల్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీ ప్రకారం.. ఏటా కోటిన్నర మంది వరకు సంతాన లేమితో బాధపడుతున్నారు. వీరిలో 29 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్య వయసు వారిలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సమస్యలకు మగవాళ్లే కారణమవుతున్నారని ఎయిమ్స్​ తెలిపింది. ప్రతి ఏడు జంటల్లో ఒకరికి ఈ ఇబ్బంది ఉన్నట్టు పేర్కొంది.

స్పెషలిస్టు డాక్టర్లతో..

రోజురోజుకు పెరుగుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెర్టిలిటీ సమస్యలను గుర్తించిన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ ‘మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ’ సెంటర్ల మీద ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆండ్రాలజిస్టులు, ఎంబ్రియాలజిస్టులతో కూడిన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో మగవాళ్లకు ఫెర్టిలిటీ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఫీమేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సెంటర్లలో గైనకాలజిస్టులు ఉన్నట్లే.. ఇక్కడ మగవాళ్ల రిప్రొడక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి స్పెషలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆండ్రాలజిస్టులు ఉంటున్నారు. హైదరాబాద్​లోని హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మగవాళ్ల కోసం మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. పలు బ్రాంచీలున్న ఈ హాస్పిటల్లో గతంలో ఆడ, మగ.. ఇద్దరికీ ఫెర్టిలిటీ ఇష్యూస్ లో ట్రీట్​మెంట్స్​ అందించేవాళ్లు. అయితే మగవారిలో పెరుగుతున్న ఫెర్టిలిటీ ఇష్యూస్, తమ సమస్యలను ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెప్పుకోవడానికి వాళ్లు పడుతున్న ఇబ్బందులను గమనించి సపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మూడేళ్ల క్రితం మేల్ ఫెర్టిలిటీ సెంటర్ ని ఏర్పాటుచేశారు. సెంటర్ లో ఆండ్రాలజిస్టులు, ఎంబ్రియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టీం ఉంటుంది. పేషెంట్ ప్రాబ్లమ్ బట్టి 10 నుంచి 20 రోజుల కోర్సుగా ట్రీట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే మగవారిలో అవగాహన పెరిగిందని, తమ ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిస్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని డాక్టర్లు అంటున్నారు.

కారణాలెన్నో..

మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలె న్నో ఉన్నాయి. లేట్ మ్యారేజ్, ఒబేసిటీ, టైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మోకింగ్, ఆల్కహాల్, పెర్ఫామెన్స్ యాంగ్జైటీ  సంతానలేమికి కారణమని డాక్టర్లు అంటున్నారు. లైఫ్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్పులు, జంక్, ఫ్రొజెన్ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అలవాటు పడటం, నిద్రలేమి కూడా ఇంపాక్ట్ చూపిస్తు న్నాయి. మగవారిలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎరక్టైల్ డిస్ ఫంక్షన్, లో, జీరో స్పెర్మ్​ కౌంట్ సమస్యలు వస్తున్నాయి.

అడ్వాన్స్‌‌డ్‌‌ ట్రీట్​మెంట్స్​

మేల్ ఫెర్టిలిటీ సెంటర్లు, ఆండ్రాలజీ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిస్ (ఆర్ట్) ట్రీట్మెంట్, మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ (మాస్) వంటి అడ్వాన్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేస్తున్నారు. అసలు వీర్యకణాలు లేని మగవారు కూడా తండ్రి అయ్యేందుకు పీసా, టీసా అనే ట్రీట్​మెంట్స్​ అందుబాటులోకి వచ్చాయి.

అవేర్​నెస్ పెరిగింది

లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మేల్ ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇన్ ఫెర్టిలిటీకి సంబంధించి కపుల్స్ లో ఇద్దరిలో సమస్య ఉంటుంది. అయితే రెండు, మూడేళ్ల కిందటి వరకు ప్రాబ్లమ్స్ చెప్పుకునేందుకు మగవారు భయపడేవారు. అందుకోసమే మా సెంటర్ లో మేల్స్​ కోసం సపరేట్ గా టీమ్ ను అందుబాటులో ఉంచాం. ఎరక్టైల్ డిస్ ఫంక్షన్, లో స్పెర్మ్​ కౌంట్ సమస్యల కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు 10 శాతం మంది వస్తే.. ఇప్పుడు 40 శాతం వరకు  తమ ప్రాబ్లమ్ ని డాక్టర్ తో డిస్కస్ చేస్తున్నారు. మేల్ ఫెర్టిలిటీకి సంబంధించి డిఫరెంట్ కోర్సులలో.. ప్రాబ్లమ్ కి అనుగుణంగా ట్రీట్మెంట్ అందిస్తున్నాం.

– డా. ఆకాష్ అగర్వాల్ (సైంటిఫిక్ డైరెక్టర్, చీఫ్ ఎంబ్రియాలజిస్ట్), హెగ్డే మేల్ ఫెర్టిలిటీ సెంటర్

ఎక్కువ సేపు కూర్చుంటే..

మగవాళ్లలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధానంగా శరీరంలో హార్మోన్స్ తగ్గటం, సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువ మోతాదులో ఆల్కహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం, స్మోకింగ్, ఏడెనిమిది గంటలకుపైగా కూర్చుని పనిచేయడం వంటివి కారణం. దీంతో వారిలో స్పెర్మ్ కౌంట్  తగ్గుతుంది. ఏడెనిమిది గంటలు కూర్చుని పని యడం అంటే దాదాపు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగిన దానితో సమానంగా నష్టం కలిగిస్తుంది. లేట్ మ్యారేజ్, సరైన ఫుడ్​ తీసుకోకపోవడం, ఎక్సర్​సైజ్​ చేయకపోవడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల్లో కెమికల్స్, కోళ్లు, చేపల పెంపకానికి వాడే ఇంజెక్షన్ల వల్ల స్పెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుతుంది. వీటితోపాటు కొన్ని మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెర్టిలిటీకి దారి తీస్తుంది.

– డాక్టర్ రాహుల్ రెడ్డి

పెళ్లికి ముందే చెక్ చేసుకోవాలి

ఇప్పుడు 30 ఏండ్లు దాటా క పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన ఏడాది, రెండేళ్లలోనే పేరెంట్స్ అవ్వాలని అనుకుంటు న్నారు. కానీ మారిన లైఫ్ స్టైల్ తో ఇన్ ఫెర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం, టైట్ జీన్స్, షర్ట్స్ వేసుకోవడం, యాంగ్జైటీ, ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల ఇన్ ఫర్టిలిటీ సమస్య ఏర్పడుతుంది. పెళ్లికి ఏడాది ముందే మగవారు సెమెన్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఫిట్ గా ఉండేందుకు ఎక్సర్ సైజ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.

– డాక్టర్​ కావ్య (గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్)

For More News..

ఆకుకూరలు తక్కువ తింటున్నరు.. 50 గ్రాములు తినాల్సింది.. 26 గ్రాములే తింటున్నరు

ఎక్కడోళ్లకు అక్కడ్నే టీకా.. పనిచేసే చోటే వేయాలని నిర్ణయం

ఉద్యోగులకు గంపగుత్తగా ప్యాకేజీ ప్రకటించనున్న సీఎం!

Tagged Hyderabad, Telangana, family, gents, Fertility centers, Gents Fertility Centers, Infertility problems

Latest Videos

Subscribe Now

More News