ఈసారి పండగ అమ్మకాలు చాలా బాగున్నాయ్​

ఈసారి పండగ అమ్మకాలు చాలా బాగున్నాయ్​
  • మాల్స్​కు​ ‘పండగే’
  • ఈసారి డిస్కౌంట్లు తక్కువే.. డిమాండ్​ ఎక్కువ ఉండటమే కారణం

న్యూఢిల్లీ:   దుస్తులు, ఎలక్ట్రానిక్స్​, లైఫ్​స్టైల్ ​ప్రొడక్టులు అమ్మే మాల్స్​, షాపులు ఖుషీఖుషీగా ఉన్నాయి. ఈసారి పండగ అమ్మకాలు చాలా బాగున్నాయ్​. కొన్ని వారాలుగా అమ్మకాలలో రికార్డు గ్రోత్ ​కనిపిస్తోంది.  నవరాత్రితో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ దశాబ్దాల గరిష్టస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది ముగిసేదాకా ఈ జోరు కొనసాగుతుందని అంటున్నారు. కస్టమర్లు ఎగబడి కొంటుండంతో చాలా బ్రాండ్లు ఈసారి పెద్దగా డిస్కౌంట్లను ఇవ్వడం లేదు. "మేం భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పుడు చూస్తున్న డిమాండ్ అత్యధికం.  సానుకూల సెంటిమెంట్, తాజా స్టాక్​వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. పండుగ సీజన్ అమ్మకాలు ఈ సంవత్సరం బాగుంటాయని మేం ఆశిస్తున్నాం. గ్రోత్​ రెండంకెల మేర ఉంటుందని అనుకుంటున్నాం" అని లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవరాజన్ అయ్యర్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో దుస్తులు, డిస్క్రెషనరీ ( విచక్షణ) వస్తువుల విభాగాల అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఈసారి అమ్మకాలు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, దుస్తులు, లైఫ్​స్టైల్​ ప్రొడక్టులు,  రెస్టారెంట్లు మార్చి క్వార్టర్​లో సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ఆఫీసులు,  సామాజిక సమావేశాలు తిరిగి మొదలైన తర్వాత షాపులు, మాల్స్​ కళకళలాడుతున్నాయి. రెండు సంవత్సరాల కోవిడ్ ఒత్తిడి తర్వాత ఇది మొదటి ఫెస్టివల్​ సీజన్​కావడంతో మాల్ నిర్వాహకులు బిజీ అయ్యారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్​ఏఐ) చేసిన సర్వే ప్రకారం, భారతదేశం అంతటా రిటైల్ వ్యాపారాలు ప్రీ -పాండమిక్ స్థాయిలతో (ఆగస్టు 2019) పోలిస్తే ఆగస్టు అమ్మకాలలో 15శాతం వృద్ధిని సాధించాయి. తమ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో దాదాపు 10శాతం అమ్మకాలు ఫిట్-అవుట్‌‌‌‌‌‌‌‌లో విభాగం ఉన్నాయని ఢిల్లీ–ఎన్​సీఆర్​ అంతటా ప్రీమియం మాల్స్‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తున్న డీఎఫ్​ఎఫ్​ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పా బెక్టర్ అన్నారు.

“సాధారణంగా ఈ సంఖ్య 3–-4శాతం వరకు ఉంటుంది.  ఈ సంవత్సరం బ్రాండ్లు కస్టమర్లను  ఆకర్షించడానికి మరింత ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే గత రెండేళ్లుగా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఈసారి కస్టమర్ల రాక కూడా రికార్డు స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం” అని ఆమె వివరించారు.  సాధారణంగా మనదేశంలో ఓనమ్​ నుంచి దుర్గాపూజ వరకు గిరాకీ బాగుంటుందని, ఈసారి డిమాండ్​ బలంగా ఉండటంతో డిస్కౌంట్లు కూడా పెద్దగా ఇవ్వలేదని ఫ్రెంచ్​ అప్పరెల్​ బ్రాండ్​సీలియో సీఈఓ సత్యేన్​ మొమయా వివరించారు. ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగానే ఉన్నా అర్బన్​ కస్టమర్లు డిస్క్రెషనరీ ప్రొడక్టులను బాగానే కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు తక్కువగా ఉండొచ్చని వివరించారు.రూ.2.60 లక్షల కోట్లుఈసారి ఫెస్టివల్​ సీజన్​లో దాదాపు 32 బిలియన్​ డాలర్ల విలువైన (దాదాపు రూ.2.60 లక్షల కోట్లు) అమ్మకాలు జరుగుతాయని  కమ్యూనిటీ ఎంగేజ్‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. వినియోగదారుల ఖర్చు 2021 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.  2019 లో ఫెస్టివల్​ ఈ 37 బిలియన్‌‌‌‌ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. దీపావళి, కిరాణా సామాగ్రి, హోం రినోవేషన్ వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారని ఈ సర్వే తెలిపింది.

అప్లయెన్స్​ ఇండస్ట్రీ అదుర్స్​..

కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌‌‌‌‌‌‌‌టన్ ఇండియా ప్రకారం, ఈ పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో అప్లయెన్స్​ ఇండస్ట్రీ  ఇప్పటికే 35శాతం వృద్ధిని సాధించింది  దుస్తులు, కాస్మొటిక్స్​, ఆరోగ్యం,  నగల  అమ్మకాలు చాలా బాగున్నాయి. ఏడాది లెక్కన ఈసారి 20 శాతం వరకు గ్రోత్​ ఉండొచ్చని ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫారాలు అనుకుంటున్నాయని థార్న్​టన్​కు చెందిన నవీన్​ మల్పానీ అన్నారు. ప్రీపాండమిక్​ లెవెల్స్​తో పోలిస్తే రిటైల్​ బిజినెస్​15 శాతం పెరిగిందని వివరించారు. ప్రీమియం సెగ్మెంట్​లో ఈసారి సేల్స్​ భారీగా రికార్డు కావొచ్చని చెప్పారు. షాపులతోపాటు సప్లై చెయిన్​ సంస్థలు కూడా బిజీగా ఉంటున్నాయి. పంపిణీదారులు, డీలర్లు  వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్ కంపెనీలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ బాగుందని ఢిల్లీకి చెందిన ఎన్​బీఎఫ్​సీ  లివ్​ఫిన్​ డైరెక్టర్ హర్షద్ మల్హోత్రా అన్నారు. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో  ఏడాది క్రితం నెలకు రూ.90-–100 కోట్ల వరకు లోన్లు ఇచ్చామని, ఈసారి నెలకు రూ.170 కోట్ల విలువైన లోన్లు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అగ్రి,  ఫుడ్ ప్రాసెసింగ్, కన్జూమర్ ​ఎలక్ట్రానిక్స్​కు మిగతా వాటి కంటే ఎక్కువ డిమాండ్​ ఉందని హర్షద్​ అన్నారు.