Gopi Galla Goa Trip: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఎక్స్పీరియ‌న్స్ కోసం గోవాకి.. ఇద్ద‌రు అనామ‌క కుర్రాళ్ల పరిస్థితి ఇది..

Gopi Galla Goa Trip: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఎక్స్పీరియ‌న్స్ కోసం గోవాకి.. ఇద్ద‌రు అనామ‌క కుర్రాళ్ల పరిస్థితి ఇది..

అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ప్రధాన పాత్రల్లో రోహిత్, శశి రూపొందించిన చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. సాయి కుమార్, సీతారామరాజు, రమణా రెడ్డి నిర్మించారు. లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ట్రైలర్ చూస్తే.. 

ఓ మారుమూల ప‌ల్లెకు చెందిన  కథే ఇది. తాము అప్ప‌టివ‌ర‌కు గోవా గురించి విన్న మాట‌ల‌ను దీష్టిలో పెట్టుకుని గోవాకి వెల్లి ఎంజాయ్ చేయాల‌ని డిసైడ్ అవుతారు. ఇలా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఎక్స్పీరియ‌న్స్ కోసం అని అక్క‌డికి వెళ్లిన వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి, ఏం చేశార‌నేది మిగిలిన క‌థ‌.

‘మాది గోపాలపురం అన్న.. మా ఊరిలో గోపన్న అని ఒక అన్న ఉన్నాడు. ఆయన గోవా గురించి రకరకాలుగా చెప్పాడు. అక్కడికి వెళితే.. అది చేయవచ్చు, ఇది చేయవచ్చు అని ఘోరంగా చెప్పాడన్నా. అందుకని పైసలన్నీ తీసుకుని వచ్చామన్నా. ఈడకి వస్తే ఏం అవుతలే అన్నా..’ అని ఇద్దరూ సమాధానం ఇచ్చారు. ఇక అసలు మీరు ‘దేని కోసం వచ్చారు?’ అని మళ్లీ ప్రశ్న అడగగా.. ‘గోపన్న చెప్పిండు.. గర్ల్ ఫ్రెండ్ ఎక్స్‌పీరియెన్స్ అంట. ఒక రోజంతా మనతోటే ఉంటారంట. ఏది బడితే అది చేయవచ్చంట..’ అని చెప్పగానే.. మరి ఏమైంది? అనే వింత ప్రశ్నలతో ట్రైలర్ క్రేజీగా సాగింది. 

ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ కి అతిథులుగా హాజరైన దర్శకులు సాయి రాజేష్​, వెంకటేష్ మహా మాట్లాడారు.. ‘ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ ‘ఇదొక క్రేజీ చిత్రం.  మ్యాజికల్ హ్యాంగవుట్ సినిమాలా ఉంటుంది’ అని అన్నాడు.

ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్ అని మరో డైరెక్టర్ శశి అన్నాడు. నిర్మాత సాయి కుమార్ మాట్లాడుతూ ‘ఈ మూవీని చూస్తే గోవాకి వెళ్లి వచ్చినట్టుగా ఉంటుంది.  ఇదొక కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ రవి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.