కాలేజీ బాత్ రూంలో స్టూడెంట్ పై అత్యాచారం..పిల్స్ కావాలా అంటూ..

కాలేజీ బాత్ రూంలో స్టూడెంట్ పై అత్యాచారం..పిల్స్ కావాలా అంటూ..

గతంలో క్లాస్​ మేట్​ కదా కొంచెం చనువిచ్చింది ఆ అమ్మాయి.. ఆమె ఉన్న పరిచయాన్ని ఆసరాగా తీసుకున్నాడు ఓ జులాయి. పదే పదే ఫోన్​చేస్తూ డిస్ట్రబ్​ చేశాడు..మాట్లాడేందుకు కలుద్దాం అన్నాడు.. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె చదువుతున్న కాలేజీకే  వెళ్లాడు..ఆమెను భయపెట్టాడు..కాలేజీ బాత్​ రూంలోనే దారుణం.. వివరాల్లోకి వెళితే..  

బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో పురుషుల వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థినిపై  అత్యాచారం చేశాడు ఓ సహవిద్యార్థి. నిందితుడు 21 ఏళ్ల జీవన్ గౌడగా గుర్తించి అతడిని అరెస్ట్​ చేశారు పోలీసులు. జ్యుడీషియల్​కస్టడీకి తరలించారు. 

అసలేం జరిగిందంటే.. 

ఎఫ్​ ఐఆర్​ లో తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు, బాధితురాలు గతంలో క్లాస్ మేట్లు...బ్యాక్​ లాగ్స్​ ఉండటంతో చదువులో వెనకబడిన నిందితుడు జీవన్​ గౌడ్​ జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బాధితురాలికి పదే పదే ఫోన్​ చేస్తూ విసిగించేవాడు. సంఘటన జరిగిన రోజున లంచ్​ టైంలో బాధితురాలి కాలేజీ వెళ్లిన జీవనగౌడ్.. ముద్దు పెట్టాలని లేకపోతే రచ్చ రచ్చ చేస్తానని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో కాలేజీ పై అంతస్తులోకి వెళ్లగా.. అసరించిన నిందితుడు జీవన్​గౌడ్​.. పురుషుల బాత్​ రూంలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటన తర్వాత పిల్స్​ కావాలంటే పంపిస్తానని నిందితుడి ఆఫర్​ ఇచ్చాడని తెలుస్తోంది.   

అక్టోబర్​ 10న బాధితురాలిపై కాలేజీ క్యాంపస్​ బాత్రూం లోనే  ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది.  ఊహించని ఘటనతో భయపడిపోయిన బాధితురాలు ఐదు రోజుల తర్వాత అక్టోబర్​ 15న పేరెంట్స్​ కి చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు. 

మొదట్లో ఫిర్యాదు చేసేందుకు సంకోచించిన బాధితురాలు.. ఐదు  రోజుల తర్వాత పేరెంట్స్​ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులో వచ్చింది.