
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిటెయిల్ చెయిన్ సెల్‌బే దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. మెరుగైన ప్రొడక్ట్ రేంజ్‌తోపాటు, ఆఫర్ల విషయంలోనూ తాము ముందుంటామని సెల్‌బే వెల్లడించింది. ప్రతి కస్టమర్‌కూ కచ్చితమైన బహుమతి వచ్చేలా ఆఫర్లు తెస్తున్నట్లు పేర్కొంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ. 7 వేల దాకా క్యాష్ బ్యాక్, స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ. 5 వేల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది సెల్‌బే. ఏడాది కాలానికి అదనపు వారంటీ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. శామ్‌సంగ్ మొబైల్స్‌పై రూ. 13 వేల దాకా తగ్గింపు, ఎంఐ మొబైల్స్‌పై రెడ్మి టీ డబ్ల్యూఎస్ 2సీ ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. అన్ని బ్రాండ్ల పైనా ఆఫర్లున్నాయని, ఒక్క రూపాయి చెల్లించి ఫైనాన్స్‌తో కొనుగోలు సదుపాయాన్నీ అందిస్తున్నామని సెల్‌బే పేర్కొంది. ఎక్స్చేంజి కోసం మెగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్‌నూ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతీ కొనుగోలుపై 6 నెలల పాటు ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్, బ్లూటూత్ స్పీకర్ లేదా పవర్ బ్యాంక్ లేదా బ్రాండెడ్ డిన్నర్ బౌల్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఉచిత ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దసరా, దీపావళి పండగల కోసం తెచ్చిన ఆఫర్లను ఉపయోగించుకోవల్సిందిగా సెల్‌బే ఎండీ సోమ నాగరాజు కస్టమర్లను ఈ సందర్భంగా కోరారు.