కామారెడ్డి చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ పదవికి పోటాపోటీ .. హస్తం పార్టీ నుంచి ఇద్దరు మధ్య తీవ్ర పోటీ

కామారెడ్డి చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ పదవికి పోటాపోటీ .. హస్తం పార్టీ నుంచి ఇద్దరు మధ్య తీవ్ర పోటీ
  • ఆరుగురు సభ్యులే ఉన్నా పోటీలో నిలిచేందుకు బీజేపీ రెడీ
  • బీజేపీ పోటీ చేస్తే కీలకంగా మారనున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్లు
  • సీన్‌‌‌‌లోకి బీజేపీ రావడంతో పెరిగిన ఉత్కంఠ 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది.  ఇటీవల చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ నిట్టు జాహ్నవి (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌)పై  కాంగ్రెస్‌‌‌‌  కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టగా నెగ్గారు.  దీంతో కొత్త చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ ఎన్నిక అనివార్యమైంది.  ఈ నెల 15న నూతన చైర్ పర్సన్‌‌‌‌ ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్‌‌‌‌ కు చెందిన కౌన్సిలర్లు మెజార్టీ సభ్యులుగా ఉన్నారు.  కానీ చైర్ పర్సన్‌‌‌‌ పదవినీ ఆ పార్టీలో ఇద్దరు ఆశిస్తున్నారు.  దీంతో హస్తం పార్టీలోనే  కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు.  దీంతో ఆరుగురు కౌన్సిలర్లు ఉన్న బీజేపీ చైర్ పర్సన్‌‌‌‌ పదవికి పోటీ చేయాలని భావిస్తోంది. 

 ఎలాంటి పోటీ లేకుండా ఏకపక్షంగా చైర్ పర్సన్‌‌‌‌ పదవి దక్కే అవకాశం ఉన్నా కాంగ్రెస్‌‌‌‌లో  అంతర్గత కుమ్ములాటలతో ఆసక్తి నెలకొంది.   కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ కూడా చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ పదవి బరిలో నిలుస్తుందని స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది.  బీజేపీ బరిలో ఉంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కౌన్సిలర్లు ఎవరికి మద్దతిస్తారనే విషయం కీలకంగా మారనుంది.  చైర్ పర్సన్‌‌‌‌ పదవి కోసం వైస్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ గడ్డం ఇందుప్రియ,  కౌన్సిలర్​  ఉరుదొండ వనిత పోటీ పడుతున్నారు.  కాంగ్రెస్‌‌‌‌లోని  27  మంది కౌన్సిలర్లలో  కొంతమంది ఇందుప్రియకు, మరికొందరు వనితకు మద్దతుగా నిలుస్తున్నారు. 

బీజేపీ పోటీకి సై అంటుండడంతో 

మున్సిపాలిటీలో బీజేపీకి ప్రస్తుతం ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు.  2019  ఎన్నికల్లో  8 మంది విజయం సాధించగా ఇద్దరు కౌన్సిలర్లు ఈ పార్టీని వీడారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  కామారెడ్డిలో  ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున వెంకటరమణారెడ్డి గెలవగా..  ఎమ్మెల్యేకు మున్సిపల్​ ఎక్స్​ ఆఫీషీయో సభ్యునిగా ఓటు హక్కు ఉంటుంది.  దీంతో  కమలం పార్టీకి 7 ఓట్లు ఉంటాయి.  మొత్తం 49 మంది కౌన్సిలర్లతో  ప్రస్తుతం  కాంగ్రెస్​ 27, బీజేపీ 6, బీఆర్​ఎస్​ 16 మంది ఉన్నారు.  

కాంగ్రెస్​లో  చైర్ పర్సన్‌‌‌‌ పదవికి పోటీ పడుతుండటంతో తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇప్పటికే కౌన్సిలర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  నిజాయతీ ఉన్న కౌన్సిలర్​ను పార్టీలకు అతీతంగా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌గా బరిలో నిలిపితే తాము మద్దతు ఇస్తామని, లేకుంటే పోటీలో ఉంటామని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రకటించారు. 

 అసెంబ్లీ ఎన్నికల టైంలో, ఆ తర్వాత బీఆర్​ఎస్​కు చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు.  బీఆర్​ఎస్​లో  మిగిలిన 16 మందిలో  రెండు గ్రూపులయ్యాయి.  ఒక గ్రూపులో  ఆరుగురు మొన్నటి వరకు చైర్ పర్సన్‌‌‌‌గా ఉన్న  జాహ్నవి వైపు ఉండగా మరో 10 మంది ఈమెకు వ్యతిరేకంగా  అవిశ్వాసానికి  కాంగ్రెస్​ సభ్యులతో కలిసి ఓటు వేశారు.   వీరితో కొందరు బీజేపీకి  మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. 

ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు

అవిశ్వాసం కోసం  క్యాంపులో ఉన్నప్పుడే  చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ పదవి కోసం కాంగ్రెస్‌‌‌‌లో ఇరువురు పోటీ పడ్డారు.  ముందు అవిశ్వాసం గట్టెక్కిన తర్వాత చైర్మన్‌‌‌‌ పదవి విషయం ఆలోచిద్దామని అప్పటి వరకు  ఏమి మాట్లాడొద్దని కౌన్సిలర్లకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సూచించారు.  చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ ఎన్నికకు తేదీ ఖరారు కావటంతో మళ్లీ ఆ పదవి కోసం పోటీ పడుతున్న కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

 పార్టీ ముఖ్య నేతలతో పాటు, కౌన్సిలర్లను కలిసి తమ మద్దతును కూడగట్టుకునేందుకు  ఇద్దరు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.   రెండు, మూడు రోజుల్లో  షబ్బీర్​అలీ పార్టీ కౌన్సిలర్లతో సమావేశం కానున్నారు.  ఒక్కో కౌన్సిలర్​తో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ పేరు ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.