ఫ్రాన్స్‌‌‌‌ పై 1‑0తో గెలిచి ట్యునీషియా సంచలనం

ఫ్రాన్స్‌‌‌‌ పై 1‑0తో గెలిచి ట్యునీషియా సంచలనం

అల్‌‌‌‌‌‌‌‌‌‌ రయాన్‌‌‌‌ (ఖతార్‌‌‌‌):  ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నాకౌట్‌‌‌‌ ముంగిట మరో సంచలనం. ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌‌‌‌ బెర్తు దక్కించుకున్న డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌ తమ ఆఖరి లీగ్‌‌‌‌లో అనూహ్యంగా ఓడింది. ఆ జట్టు జోరుకు అనామక ట్యునీషియా బ్రేక్​  వేసి మెగా టోర్నీలో సంచలనం రేపింది.  బుధవారం జరిగిన గ్రూప్​–డి పోరులో ట్యునీషియా 1-0తో ఫ్రాన్స్‌‌‌‌ను ఓడించింది. అయితే, మరో మ్యాచ్‌‌‌‌లో డెన్మార్క్‌‌‌‌ను ఆస్ట్రేలియా ఓడించడంతో ట్యునీషియాకు నాకౌట్‌‌‌‌ బెర్తు దూరమైంది. అయినా, తమ హిస్టరీలో చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఆఖరి క్షణం వరకూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో బాల్‌‌‌‌ను ఎక్కువగా తమ కంట్రోల్‌‌‌‌లోనే ఉంచుకున్నా.. ప్రత్యర్థితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాడులు చేసినా.. ఫ్రాన్స్‌‌‌‌ ఒక్క గోల్‌‌‌‌ కూడా చేయలేకపోయింది. ఫస్టాఫ్‌‌‌‌లో ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. అయితే, సెకండాఫ్‌‌‌‌ 58వ నిమిషంలో లౌడౌని నుంచి పాస్‌‌‌‌ అందుకున్న వాబి ఖజ్రి ట్యునీషియాకు గోల్‌‌‌‌ అందించాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆ జట్టుకు ఇదే ఫస్ట్‌‌‌‌ గోల్‌‌‌‌ కావడం విశేషం. దాంతో, మ్యాచ్‌‌‌‌లో వెనుకబడ్డ ఫ్రాన్స్‌‌‌‌ తర్వాత పుంజుకోలేకపోయింది.  చివరి 20 నిమిషాల్లో తమ గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ను వదిలేసిన ఫ్రాన్స్‌‌‌‌ ప్లేయర్లు పూర్తిగా ట్యునీషియా ఏరియాలోనే ఆడారు.

బాల్‌‌‌‌ను పూర్తిగా తమ కంట్రోల్‌‌‌‌లో ఉంచుకొని పలు దాడులు చేసినా.. ప్రత్యర్థి గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఎంబాపె ఒకటి రెండు ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు.  అదనపు టైమ్‌‌‌‌ ముగుస్తుందనగా గ్రీజ్‌‌‌‌మన్‌‌‌‌ గోల్‌‌‌‌ చేసి స్కోరు సమం చేసినా.. రివ్యూలో రిఫరీ దాన్ని ఆఫ్‌‌‌‌సైడ్‌‌‌‌గా ప్రకటించడంతో ఫ్రాన్స్‌‌‌‌కు ఓటమి తప్పలేదు.  ట్యునీషియాలో గోల్‌‌‌‌ కొట్టిన ఖజ్రితో పాటు కీపర్‌‌‌‌ డాహ్మెన్‌‌‌‌ కూడా హీరోగా నిలిచాడు. 2014 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ తర్వాత ఈ టోర్నీలో ఫ్రాన్స్‌‌‌‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.

ఆసీస్​ రెండోసారి..

వరల్డ్​కప్​లో ఆరుసార్లు తలపడ్డ ఆస్ట్రేలియా రెండోసారి నాకౌట్​ చేరుకుంది. గ్రూప్​–డి మరో మ్యాచ్‌‌లో ఆసీస్​ 1–0తో డెన్మార్క్‌‌పై విజయం సాధించింది. 60వ నిమిషంలో మాథ్యూ లెకీ   విన్నింగ్​ గోల్‌‌ అందించి 2006 తర్వాత  ఆసీస్​ను ప్రిక్వార్టర్స్​ చేర్చాడు. ఈ గ్రూప్​లో తొలి రెండు మ్యాచ్‌‌ల్లో విజయాలు, ఆఖరి మ్యాచ్‌‌లో ఓటమితో ఫ్రాన్స్‌‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌‌ టాపర్‌‌గా నిలిచింది. ఆస్ట్రేలియా కూడా అన్నే పాయింట్లతో ఉన్నా గోల్‌‌ డిఫరెన్స్‌‌తో రెండో స్థానం సాధించింది. ఒక్కో గెలుపు, ఓటమి, డ్రాతో ట్యునీషియా 4 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టింది. డెన్మార్క్‌‌  ఓ డ్రా, రెండు ఓటములతో (1 పాయింట్‌‌) నాలుగో ప్లేస్‌‌లో నిలిచింది.