Cricket World Cup 2023: ఒత్తిడిలో సత్తా చాటారు: కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీలు.. గెలుపు దిశగా భారత్

Cricket World Cup 2023: ఒత్తిడిలో సత్తా చాటారు: కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీలు.. గెలుపు దిశగా భారత్

అసలే సాధారణ లక్ష్యం.. భారత్ బ్యాటింగ్ లైనప్ కి అయితే ఇది స్వల్ప లక్ష్యం. ఆడేది స్వదేశంలో ఇంకేముంది వరల్డ్ కప్ లో మనోళ్లు బోణీ కొట్టినట్టే అనుకున్నారు. కానీ భారత్ బ్యాటింగ్ దిగిన పావుగంటలో అల్లకల్లోమైపోయింది. దిగినవారు పెవిలియన్ కి క్యూ కడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు టాప్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 2 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో  సొంతగడ్డపై పరాభవం తప్పదేమో అని భయపడ్డారు.

ఈ దశలో టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంతో పరిణితి చూపించారు. ఎక్కడా కంగారు పడకుండా ఆసీస్ బౌలర్లని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో కోహ్లీ 75 బంతుల్లో, రాహుల్ 72 బంతుల్లో హాఫ్ సెంచరీలు  చేసుకున్నారు. వీరిద్దరూ క్రీజ్ లో పాతుకుపోవడంతో భారత్ గెలుపు దిశగా పయనిస్తోంది. కాగా..  ప్రస్తుతం భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (60) రాహుల్. మరో 20 ఓవర్లలో 80 పరుగులు చేస్తే భారత్ గెలుస్తుంది.