పచ్చీస్ ఫేమ్ రామ్జ్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘ఫైటర్ రాజా’. మాయా కృష్ణన్ హీరోయిన్. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి సంబధించిన ప్రతిది చాలా ప్రామిసింగ్‌గా ఉంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా వైబ్ టీజర్లో కనిపించింది. ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న వేణు సినిమా సక్సెస్ అవ్వాలని కోరాడు. లవ్, మనీ, ఫ్యామిలీ ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ‘ఫైటర్ రాజా’ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని రామ్జ్ చెప్పాడు. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని కృష్ణ ప్రసాద్ అన్నాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని నిర్మాతలు చెప్పారు.