గుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది

గుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది

నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ జరిగింది.మాట మాట పెరిడంతో  ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.  పోలీసులు పరిస్థితి సద్దుమణించి భక్తులను పోలీస్ స్టేషను తరలించడంతో వివాదానికి పుల్‎స్టాప్ పడి భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. 

వివరాల్లోకి వెళ్తే...

అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబం  శ్రీ కామేశ్వర సహిత మహానందీశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు అష్టాదశ మహామంగళ హారతులు ఇస్తారు. ఈ సమయంలో సాధారణ భక్తుల దర్శనం ఆపివేస్తారు. మహామంగళహారతులు దర్శించుకోవాలనే భక్తులకు ఒకొక్కరికి 150 రూపాయిలు టికెట్ తీసుకోవాలని ఆలయాధికారులు  నిర్ణయించారు.

ఆ సమయంలో  అనంతపురానికి చెందిన భక్తులు గుంపులుగా వచ్చారు. దర్శనానికి  అనుమతి ఇవ్వాలని అడగగా ప్రత్యేక రుసుం చెల్లించి దర్శించుకోవాలని ఆలయ సిబ్బంది సూచించారు.  స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఎందుకు డబ్బులు కట్టాలని నిలదీశారు. దీంతో భక్తులు,ఆలయ సిబ్బంది మధ్య మాట మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగించారు.  యాత్రికులను   మహానంది పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు.

ALSO READ : ఎట్టకేలకు OTTలోకి వస్తున్న రామబాణం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 దేవస్థానం ఆదాయమే పరమావధిగా భక్తుల నుంచి సేవల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.  ఉచిత దర్శనాల విషయంలో సరైన బోర్డులు లేకపోవడం భక్తులు టిక్కెట్ రుసుం చెల్లించే వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది.ఇప్పటికైన అధికారులు భక్తులకు సరైన సూచనలు,ఉచిత‌ దర్శనం క్యూలైన్ల సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఆలయ సిబ్బంది అసలు డబ్బులు అడగడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.