క్యాన్సర్​తో ఫైట్​ చేస్తున్నా : సుశీల్ మోదీ

క్యాన్సర్​తో ఫైట్​ చేస్తున్నా : సుశీల్ మోదీ
  •  లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయలేను 

న్యూఢిల్లీ : ఆరు నెలలుగా క్యాన్సర్​తో పోరాడుతున్నట్టు బీజేపీ నేత సుశీల్ మోదీ తెలిపారు. అందుకే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్విట్టర్​లో వెల్లడించారు. ‘‘ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ప్రచారానికి దూరంగా ఉంటున్న. ప్రధానికి అన్ని వివరించా. ఈ దేశానికి, బిహార్‌ స్టేట్​కు, పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితం ప్రజా సేవకు అంకితం’’ అని సుశీల్ మోదీ ట్విట్టర్​లో రాసుకొచ్చారు.