2 నెలల్లో ఎఫ్‌‌‌‌ఐఐలు అమ్మింది రూ.1.12 లక్షల కోట్ల షేర్లు.. ఈ ఏడాది సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ 6 శాతం డౌన్‌‌‌‌

2 నెలల్లో ఎఫ్‌‌‌‌ఐఐలు అమ్మింది  రూ.1.12 లక్షల కోట్ల షేర్లు.. ఈ ఏడాది  సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ 6 శాతం డౌన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఫారిన్‌‌‌‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) కిందటి నెలలో నికరంగా రూ.34,574 కోట్లను ఇండియా స్టాక్‌‌‌‌ మార్కెట్ నుంచి విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో నికరంగా  అమ్మిన షేర్ల విలువ రూ.1.12 లక్షల కోట్లకు చేరుకుంది.  గ్లోబల్‌‌‌‌గా ట్రేడ్ వార్ నడుస్తుండడం,   కంపెనీల రిజల్ట్స్ మెప్పించకపోవడంతో ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్‌‌‌‌ఐఐలు వెళ్లిపోతున్నారు. 

అంతేకాకుండా  ఇండియన్ కంపెనీల వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నాయని, ఫలితంగా ఎఫ్‌‌‌‌ఐఐల ఔట్‌‌‌‌ఫ్లో కొనసాగుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు  ఈ ఏడాది జనవరిలో రూ.78,027 కోట్లను మార్కెట్ నుంచి విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. వీరి అమ్మకాలు కొనసాగుతుండడంతో  బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 6 శాతం పడ్డాయి. యూఎస్ బాండ్‌‌‌‌ ఈల్డ్‌‌‌‌లు పెరగడం, డాలర్ బలపడడం, గ్లోబల్‌‌‌‌గా అనిశ్చితి పెరగడంతో యూఎస్‌‌‌‌ అసెట్స్‌‌‌‌ వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు.

ఈ వారమూ టారిఫ్‌‌‌‌పైనే చూపు 

యూఎస్ టారిఫ్ వార్తలు ఈ వారం కూడా మార్కెట్‌‌‌‌ను ప్రభావితం చేయనున్నాయి.  ఫారిన్ ఇన్వెస్టర్ల కదలికలు, గ్లోబల్ ట్రెండ్స్‌‌‌‌పై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు మార్కెట్‌‌‌‌ నుంచి వెళ్లిపోతుండడంతో పాటు, యూఎస్‌‌‌‌–చైనా మధ్య టారిఫ్​ వార్‌‌‌‌ ముదరడంతో ఈ వారం మార్కెట్‌‌‌‌లో వోలటాలిటీ కనిపించొచ్చని వివరించారు. 

ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ డేటా ఈ వారం విడుదల కానున్నాయి.  కాగా, ఫిబ్రవరిలో ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) నష్టపోగా, సెన్సెక్స్ 4,300 పాయింట్లు పడింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 27 న  సెన్సెక్స్ 85,978 దగ్గర జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ లెవెల్‌‌‌‌ నుంచి ప్రస్తుతం 15 శాతం నష్టానికి ట్రేడవుతోంది. ఇదే టైమ్‌‌‌‌లో నిఫ్టీ 4,153 పాయింట్లు పతనమైంది.