మాతృత్వపు మాధుర్యం మరువలేనిది : స్నేహ

మాతృత్వపు మాధుర్యం మరువలేనిది : స్నేహ
  • సినీ నటి స్నేహ
  • గ్రాండ్ కాకతీయలో ఉత్సాహంగా ఫెర్టీ9 బేబీ మీట్

హైదరాబాద్, వెలుగు : మాతృత్వపు మాధుర్యం మరువలేనిదని సినీ నటి స్నేహ తెలిపారు. ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ట్రీట్​మెంట్ తీసుకుని పిల్లలను కన్న తల్లిదండ్రులతో శనివారం హోటల్ గ్రాండ్ కాకతీయలో బేబీ మీట్‌‌ కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన నటి స్నేహ మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూసే మహిళలకు ఫెర్టి9 మంచి సేవలు అందిస్తోందన్నారు. ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్  సి. జ్యోతి మాట్లాడుతూ..

పదేండ్లుగా తమ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ట్రీట్​మెంట్ తీసుకుని ఎంతోమంది దంపతులు తల్లిదండ్రులు అయ్యారన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు అయిన వారు,  కాబోయే తల్లిదండ్రులు ఒక చోట చేరి వారి అనుభవాలను పంచుకోవడానికి ఓ నెట్​వర్క్​ను రూపొందించేందుకు ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామన్నారు. సంతానోత్పత్తి ప్రయాణంలో ప్రతి అడుగు ప్రాధాన్యతను  ఫెర్టీ9 అర్థం చేసుకుంటుందని ఆమె తెలిపారు.