
ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం చెన్నైలో మరణించారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎస్. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్ హిట్ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అనేక మేటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పాపులర్ అయ్యాయి. ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి.