ఎయిర్ ఇండియా కొనేందుకు టాటా గ్రూప్ బిడ్

ఎయిర్ ఇండియా కొనేందుకు టాటా గ్రూప్ బిడ్
  • పోటీ లేకుండా కైవసం చేసుకోనున్న టాటా

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ బిడ్ వేసింది. బిడ్ దాఖలుకు ఇవాళే చివరి తేదీ కాగా... టాటా గ్రూప్ మినహా మరే సంస్థ బిడ్ దాఖలు చేయలేదు.  ఈ గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్‌ ఒక్కటే ఎయిర్‌ ఇండియా కోసం బిడ్‌ దాఖలు చేయడంతో ఎలాంటి పోటీ లేకుండా టాటా గ్రూప్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. స్పైస్ జెట్ కూడా రంగంలో నిలుస్తుందని భావించినా బిడ్ దాఖలు చేయలేదు. 
ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు దాదాపు  43వేల కోట్ల రూపాయల అప్పులుండగా, అందులో  22 వేల కోట్లను ఎయిర్‌ ఇండియా అసెంట్ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు ఎయిర్‌ ఇండియాతో పాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా వంద శాతం వాటా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఎయిర్‌ ఇండియా భవనం, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్‌ హౌస్‌ కూడా అమ్మేయాలని నిర్ణయించింది.