అభ్యంతరాలు పరిశీలించాకే ఫైనల్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ : అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

అభ్యంతరాలు పరిశీలించాకే ఫైనల్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ : అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్ టౌన్, వెలుగు: మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ  దృష్టికి తీసుకురావాలని, ఆయా అంశాలను పరిశీలించాకే ఫైనల్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తామని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే  అన్నారు. 

మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణించిన వారి ఓట్లు, రెండు చోట్ల నమోదైన ఓట్ల సమాచారం అందించాలన్నారు. అంతకుముందు రాజకీయ పార్టీల లీడర్లు మాట్లాడుతూ చనిపోయిన వారి ఓట్లు తొలగించడంతోపాటు కుటుంబసభ్యుల ఓట్లు అన్నీ ఒకే డివిజన్‌‌‌‌‌‌‌‌, వార్డులో వచ్చేలా చూడాలన్నారు. వివిధ పార్టీల లీడర్లు సునీల్ రావు, హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు. 

నోడల్ అధికారులు సమర్థంగా పనిచేయాలి

జగిత్యాల టౌన్, వెలుగు: మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల నిర్వహణలో నోడల్‌‌‌‌‌‌‌‌ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజగౌడ్‌‌‌‌‌‌‌‌తో కలిసి రానున్న మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలపై రివ్యూ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల లీడర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 

ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలని కోరారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 10వ తేదీ లోపు రాతపూర్వకంగా తెలపాలని సూచించారు.