
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందించలేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నార్సింగి చైతన్య కాలేజీకి షోకాస్ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. పూర్తి వివరాలు అందించాలని కోరినట్టు తెలిపింది. సాత్విక్ ఆత్మహత్య ఘటనలో ఎలాంటి తుది నివేదిక సిద్ధం కాలేదని తేల్చి చెప్పింది. ఈ రోజు ఆదివారం కావడం రిపోర్ట్స్ సమర్పించడం వీలు కాదన్న ఇంటర్ బోర్డు.. కొన్ని మీడియా ఛానెల్ లో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.