మొత్తం ఓటర్లు 23 లక్షల 561..ఉమ్మడి నల్గొండ జిల్లా ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్

మొత్తం ఓటర్లు  23 లక్షల 561..ఉమ్మడి నల్గొండ జిల్లా ఫైనల్ ఓటర్ లిస్ట్  రిలీజ్
  •     మహిళలే ఎక్కువ

యాదాద్రి, నల్గొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫైనల్ ఓటర్​లిస్ట్​ను  ఆఫీసర్లు మంగళవారం రిలీజ్​చేశారు. గత నెల 28న విడుదల చేసిన ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితా విడుదల చేశారు.

బ్యాలెట్​పేపర్లు రెడీ..

పంచాయతీల్లో సర్పంచ్ ల పదవీకాలం 2024 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటినుంచి స్పెషల్​ఆఫీసర్లు పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికారులు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. 100 ఓట్ల కంటే తక్కువగా ఉన్న పోలింగ్​స్టేషన్లతోపాటు 101–-200, 201–-400, 401–-650 మధ్య ఓట్లున్న స్టేషన్లను గుర్తించి నోటిఫై చేశారు. ఇప్పటికే బ్యాలెట్​పేపర్లు ప్రింట్​చేసి రెడీగా ఉంచారు. 

మహిళా ఓటర్లే ఎక్కువ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 23,00,561 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81 మంది ఇతరులు. అయితే మూడు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ. పురుష ఓటర్లు 11,36,180  మంది ఉండగా మహిళలు 11,64,300 మంది ఉన్నారు. ఫైనల్​ ఓటర్​లిస్ట్​ రిలీజ్​ చేయడంతో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చ మొదలైంది. ఏయే స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయిస్తారోనన్న చర్చ 
జరుగుతోంది.

పంచాయతీల వివరాలు..

నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు, 7,494 వార్డులు, పోలింగ్​కేంద్రాలున్నాయి. 22.50  లక్షల బ్యాలెట్​పేపర్లు ప్రింట్​చేశారు. 5,876 బ్యాలెట్ బాక్సులున్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 486 పంచాయతీలు, 4,388 వార్డులు ఉన్నాయి. 4,403 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 14 లక్షల బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేశారు. యాదాద్రి జిల్లాలో 427 పంచాయతీలు, 3,704 వార్డులు, పోలింగ్​సెంటర్లు ఉన్నాయి. అవసరమైన 13 లక్షల బ్యాలెట్​ పేపర్లు ఇప్పటికే ప్రింట్​చేశారు. బ్యాలెట్ బాక్సులు 1,800 ఉండగా ఇందులో 150కి పైగా పనికి రాకుండా పోయాయి. అవసరమైన బాక్సులను తెప్పించనున్నారు.  


   జిల్లా        పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం

నల్గొండ       5,30,860       5,42,589             57    10,73,506
సూర్యాపేట    3,40,743    3,54,050           22      6,94,815 
యాదాద్రి     2,64,577     2,67,661             02      5,32,240