1,663 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

1,663 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శనివారం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్​ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్, ఆర్ అండ్‌‌‌‌ బీ శాఖలోని ఇంజనీరింగ్‌‌‌‌ విభాగంలో 1,522 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌లో 1,238 పోస్టులు ఉన్నాయని వివరించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ అండ్ బీ, ఎన్‌‌‌‌హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ, ఆర్‌‌‌‌‌‌‌‌యూబీఎస్, హెచ్‌‌‌‌వోడీలో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్‌‌‌‌ అకౌంట్స్ హెచ్‌‌‌‌వోడీలో 53, డైరెక్టర్​ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌‌‌మెంట్(హెచ్‌‌‌‌వోడీ)లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అనుమతించిన పోస్టుల సంఖ్య 46,998కు చేరింది. 
 

పోస్టు పేరు ఖాళీలు
ఏఈఈ 704
ఏఈ   227
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 212
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 95
సివిల్ ఏఈ 38
సివిల్ ఏఈఈ 145
ఎలక్ట్రికల్ ఏఈఈ  13
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్​ 60
టెక్నికల్ అసిస్టెంట్ 27
సీనియర్ అర్కిటెక్చురల్ అసిస్టెంట్​     01
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్​  53
భూగర్భ జల శాఖలో వివిధ పోస్టులు 88