కరోనాతో దెబ్బతిన్న రంగాలకు మరో ఆర్థిక ప్యాకేజీ

కరోనాతో దెబ్బతిన్న రంగాలకు మరో ఆర్థిక ప్యాకేజీ
 • హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై ఫుల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌
 • ఎమర్జెన్సీ క్రెడిట్‌‌‌‌ గ్యారెంటీ లైన్‌‌‌‌ స్కీమ్  కోసం అదనంగారూ. 1.5 లక్షల కోట్లు 
 • మొదటి ఐదు లక్షల మంది టూరిస్ట్‌‌‌‌లకు ఫ్రీ వీసా

న్యూఢిల్లీ: కరోనా వలన నష్టపోయిన సెక్టార్లను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం రూ.6,28,993 కోట్లతో వివిధ ఎకనామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలను  సోమవారం  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో నాలుగు చర్యలు కొత్తగా తీసుకున్నారు. ఈ సారి ప్రకటించిన రిలీఫ్ చర్యలలో  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్ద పీట వేశారు. వీటితో పాటు గ్రోత్, ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ చేసేందుకు మరో ఎనిమిది చర్యలను సీతారామన్ ప్రకటించారు. వీటిలో ఆరు చర్యలు కొత్తగా తీసుకున్నవే. 

లోన్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 •  కరోనా వలన నష్టపోయిన సెక్టార్లకు ఆర్థికంగా సాయం చేసేందుకు రూ. 1.1 లక్షల కోట్లతో లోన్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 50 వేల కోట్లను హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్ కోసం కేటాయించారు. దేశంలోని మెడికల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరిచేందుకు ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరముండే సెగ్మెంట్లలో ఈ మనీని వాడనున్నారు. 
 • ఎనిమిది మెట్రో సిటీలను మినహాయించి, ఇతర ప్రాంతాల్లో హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విస్తరించాలనుకునే వారిని ఈ లోన్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్ చేస్తుంది. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తే  50% వరకు, కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేపడితే 75 శాతం వరకు  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద బ్యాంకులు లోన్లను ఇస్తాయి. 3 ఏళ్ల వరకు  ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద లోన్లను తీసుకున్న వారికి  వడ్డీ రేటును ఏడాదికి 7.95 శాతానికి పరిమితం చేశారు. సాధారణంగా అయితే  ఈ వడ్డీ రేటు 10–11% వరకు ఉంటుంది. 
 • కరోనా వలన దెబ్బతిన్న  మిగిలిన సెక్టార్ల కోసం రూ. 60 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సెక్టార్లకు ఏడాదికి 8.25 శాతం వద్ద లోన్లను ఇవ్వడానికి ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడతారు.

ఎమెర్జెన్సీ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 • ఎమెర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కింద ప్రభుత్వం చిన్న, మధ్య తరహా  కంపెనీల (ఎంఎస్​ఎంఈ)కు లోన్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లకు పొడిగించింది. కిందటేడాది రూ. 20 లక్షల కోట్ల  స్టిమ్యులస్ ప్యాకేజిలో భాగంగా రూ.3 లక్షల కోట్లను ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం  ప్రభుత్వం కేటాయించింది. తాజాగా మరో రూ. 1.5 లక్షల కోట్లను ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యాడ్ చేసింది.  

మైక్రో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

 • మైక్రో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా మొత్తం 25 లక్షల మందికి లోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రూ. 1.25 లక్షల వరకు  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇస్తారు. ఈ లోన్లపై వడ్డీ రేటును ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటుపై  2% అదనంగా విధిస్తారు. ఇప్పటికే లోన్లు తీసుకున్న వాళ్లు కూడా అర్హులే. 89 రోజుల లోపు డిఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న వారు కూడా ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద అర్హులే. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం మొత్తం రూ. 7,500 కోట్లను కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, ఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు లోన్లుగా ఇస్తాయి. తర్వాత ఇవి కస్టమర్లకు లోన్ ఇవ్వడానికి ఈ డబ్బులను వాడతాయి. 
 • డిఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 75 శాతం వరకు నేషనల్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీజీటీసీ) గ్యారెంటీగా ఉంటుంది. మూడేళ్ల లోపు డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన లోన్లకు ఈ సంస్థ గ్యారెంటీగా ఉంటుంది.

టూరిజం రికవరీ..

 • రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న 11 వేల మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్లు, ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ టూరిజం ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వీరికి లోన్లను ఇవ్వనున్నారు. ట్రావెల్ ఏజెన్సీకి రూ. 10 లక్షల వరకు, టూరిస్ట్ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. లక్ష వరకు లోన్లను ఇస్తారు. వీటిపై 100 % గ్యారెంటీగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీజీటీసీ ఉంటుంది. 

ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గార్ యోజన..

 •  ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయీ ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గవర్నమెంటే చెల్లిస్తుంది.

ఫెర్టిలైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ..

 • డీఏపీ, పీ అండ్ కే ఫెర్జిలైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అదనంగా సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌‌‌‌‌‌‌‌బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 27,500 కోట్ల నుంచి రూ. 42,275 కోట్లకు పెంచారు.   డీఏపీ, పీ అండ్ కే ఫెర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సబ్సిడీ ఇచ్చేందుకు అదనంగా రూ. 14,775 కోట్లను కేటాయించారు. 

ఫ్రీ రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 • ప్రధాన్ మంత్రీ గరీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పొడిగించింది. అర్హులకు నవంబర్ వరకు 5 కేజిల బియ్యాన్ని  ఫ్రీగా ఇస్తారు. దీంతో ప్రభుత్వానికి  రూ. 93,869 కోట్లు అదనంగా ఖర్చవుతాయి.  

పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 • పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం మరో ఏడాదికి గాను రూ. 23,220 కోట్లను కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా రూ. 15 వేల కోట్లు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడానికి ఈ ఫండ్స్ వాడతారు. 

గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎనిమిది చర్యలు.. 

 • భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అదనంగా రూ. 19,041 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించిన మొత్తం ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 61,109 కోట్లకు చేరుకున్నాయి.
 • ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈసీజీసీ) లో రూ. 88 వేల కోట్లను ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయనుంది. దేశ ఎగుమతులపై ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీని మరింత పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. 
 • ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2025–2026 సంవత్సరానికి కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. 
 • పవర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరిచేందుకు రూ. 3.03 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. దీనిలో కేంద్రం రూ. 97,631 కోట్లు ప్రొవైడ్ చేయనుండగా, మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.
 • కీలక సెక్టార్లలోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులను అమ్మి ఫండ్స్ సేకరించడానికి, క్లాత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం, పీపీపీ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమోదించడానికి ఒక కొత్త పాలసీని తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. 
 • నేషనల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఐఏ) కింద వచ్చే ఐదేళ్లకు గాను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ను పెంచేందుకు రూ. 33 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.
 • నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అగ్రిప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సేకరించడానికి, ప్రాసెసింగ్ కోసం నార్త్ ఈస్ట్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ని తిరిగి ఏర్పాటు చేయనున్నారు. 
 • మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించేందుకు, రైతుల ఆదాయాలను డబుల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీసాలు ఫ్రీ..

వీసాలను ఇష్యూ చేయడం తిరిగి ప్రారంభమయ్యాక, మొదటగా అప్లయ్ చేసుకున్న ఐదు లక్షల మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఫ్రీగా వీసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒకసారి మాత్రమే ఈ బెనిఫిట్స్  అందుతాయి. వచ్చే ఏడాది మార్చి 31 లేదా మొత్తం 5 లక్షల మందికి వీసాలు ఇష్యూ చేసేంత వరకు ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రూ. 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒక నెల టూరిస్ట్ వీసాలను ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఇస్తారు.