ధరలలో వ్యత్యాసం పర్చేజింగ్​ డెసిషన్స్​పై ప్రభావం

 ధరలలో వ్యత్యాసం పర్చేజింగ్​ డెసిషన్స్​పై ప్రభావం

వాషింగ్టన్​: గ్లోబలైజేషన్​ బెనిఫిట్స్​ను రివర్స్​ చేయాలని తాము కోరుకోవడం లేదని, కానీ ప్రాసెస్​ మరింత పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్​సమావేశంలో భాగం పంచుకోవడానికి ఫైనాన్స్​ మినిస్టర్​ వాషింగ్టన్​ చేరుకున్నారు. పీటర్సన్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఇంటర్నేషనల్​ ఎకనమిక్స్​లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్​ఎదిగేలా చేయడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయని చెబుతూ, ఫైనల్ కన్జూమర్​ గూడ్స్​ను తాము దిగుమతి చేసుకోమని, అవి తయారు చేసుకునే కెపాసిటీ తమకు ఉందని నిర్మల​ పేర్కొన్నారు. ధరలలో వ్యత్యాసం పర్చేజింగ్​ డెసిషన్స్​పై ప్రభావం చూపెడుతుందని, తక్కువ రేటుకే దొరికేటప్పుడు తయారు చేయడం ఎందుకనే ఆలోచనతో, దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ​ఈ సమస్యను ఇండియన్స్​ చాలా కాలంగా ఎదుర్కొంటున్నారని, రోజూ వాడే కొన్ని ప్రొడక్టులను తయారు చేసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. కానీ, దేశంలోనే ఎక్కువ మంది కన్జూమర్లు ఉండటంతో ఇప్పుడు ఇక్కడే తయారు కావాలనే ఆలోచనతో 
పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

డబ్ల్యూటీఓ ఇతర దేశాల మాట కూడా వినాలి

వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూటీఓ) ఇతర దేశాల మాట కూడా వినాలని, మరింత ప్రోగ్రెసివ్​గా ఉండాలని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. అందరు మెంబర్లకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. మార్కెట్​ లిబరలైజేషన్​ ఏమేరకు ఉండాలనే విషయంలో ఇప్పుడు చాలా దేశాలు ఆలోచిస్తున్నాయని అమెరికా కామర్స్​ సెక్రటరీ కేథరిన్​ తాయ్​ ఇటీవల ఒక సందర్భంలో చెప్పారని, 2014–15 లో తాను కామర్స్​ మినిస్టర్​గా ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇదే విషయాన్ని ప్రస్తావించినా గ్లోబల్​ మీడియా దృష్టిని ఆకట్టుకోలేకపోయానని ఆమె అన్నారు. ఇప్పుడు కూడా చాలా దేశాలు తనలాగే ఆలోచిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆఫ్రికా లేదా పసిఫిక్​ ఐలాండ్స్​ లేదా మరేదైనా దేశం...అన్ని దేశాలు ఎదగాలని కోరుకుంటున్నాయని, ఇండియాకు ఆయా దేశాలు చేసే  ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలూ లేవని చెప్పారు. మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​(ఎంఎఫ్​ఎన్​)  రూట్​లో తమ దేశంలో తయారు చేయగల ప్రొడక్టులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని, ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు.