కాంతారా మూవీ అద్భుతమంటూ నిర్మల ప్రశంసలు

కాంతారా మూవీ అద్భుతమంటూ నిర్మల ప్రశంసలు

కన్నడ సినిమాగా తెరకెక్కిన కాంతార మూవీ అన్ని భాషల్లోనూ హిట్ టాక్‭ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ అద్భుతంగా ఉందంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. బెంగళూరులో కాంతార చిత్రాన్ని చూసిన నిర్మలా సీతారామన్ ప్రశంసలతో ముంచెత్తారు. తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బెంగళూరులోని ఓ థియేటర్‌లో ఆమె కాంతారా చిత్రాన్ని చూశారు.  

తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతార ప్రతీకగా నిలిచిందని నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు. అక్కడి సంప్రదాయాలను అందంగా చిత్రీకరించారని చెప్పారు. హీరోగా చేస్తూ.. దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిని నిర్మలా మెచ్చుకున్నారు. తన వాలంటీర్లతో థియేటర్‭లో దిగిన ఫోటోను కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇందుకు థ్యాంక్యూ మేడమ్ అంటూ రిషబ్ శెట్టి ట్విట్టర్ వేదికగా స్పందించారు.