పెండ్లి ఖర్చులకు ఆర్థిక సాయం

పెండ్లి ఖర్చులకు ఆర్థిక సాయం

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్‌‌లో రెండు పేదింటి కుటుంబాలకు చెందిన పెళ్లి కూతుళ్లకు ‘రామకృష్ణాపూర్‌‌ యువత స్వచ్ఛంద సంస్థ’ ఆర్థిక సాయం చేసింది. ఆర్కేపీకి చెందిన అవునూరి శంకరమ్మ-–బ్రహ్మయ్య దంపతులు, జమ్మిశెట్టి జమ్మిశెట్టి శంకరమ్మ-–సురేశ్​ దంపతుల కుమార్తెలకు పెండ్లిళ్లు నిశ్చయమయ్యాయి. వీరు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో రామకృష్ణాపూర్‌‌ యువత స్వచ్ఛంద సంస్థ వారు రూ.10వేలు, రూ.5,500 ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్, ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి,  సలహాదారుడు బింగి శివకిరణ్,  ఆర్నే సతీశ్‌ , సంగ రవి పాల్గొన్నారు.