విటోప్రొటెక్ట్​ టెక్నాలజీతో ఫియోనా సన్‌‌ఫ్లవర్ ఆయిల్‌‌

విటోప్రొటెక్ట్​ టెక్నాలజీతో  ఫియోనా సన్‌‌ఫ్లవర్ ఆయిల్‌‌

హైదరాబాద్, వెలుగు: ఎడిబుల్ ఆయిల్స్ అమ్మే అగ్రిబిజినెస్ ​ ఫుడ్ కంపెనీ బంగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బంగే ఇండియా) తెలంగాణ మార్కెట్లోకి రిఫైండ్ సన్‌‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ఫియోనాను తీసుకొచ్చింది.

ఇందులో ఏ,డీ,ఈ విటమిన్లు ఉంటాయని తెలిపింది. సాధారణంగా నూనెను వేడిచేసినప్పుడు విటమిన్లు నాశనమవుతాయని, అయితే తాము విటోప్రొటెక్ట్​టెక్నాలజీని వాడటం వల్ల ఈ సమస్య ఉండదని బంగే తెలిపింది. 

సెల్లర్ల ఫీజు తగ్గించిన అమెజాన్‌‌

న్యూఢిల్లీ: అమెజాన్‌‌లో ప్రొడక్ట్‌‌లు అమ్ముతున్న సెల్లర్ల ఫీజులు తగ్గాయి. ఫెస్టివల్ సీజన్ మొదలయ్యే ముందు  సెల్లర్ల ఫీజులను  3  శాతం నుంచి 12 శాతం  వరకు తగ్గించామని ఈ ఈ–కామర్స్‌‌ కంపెనీ ప్రకటించింది. వచ్చే నెల 9 నుంచి ఈ మారిన రేట్లు అందుబాటులోకి వస్తాయి.  అన్ని కేటగిరీల్లోని సెల్లర్ల ఫీజులను తగ్గించామని అమెజాన్ పేర్కొంది.

మరిన్ని  ప్రొడక్ట్‌‌లను అమ్ముకోవడానికి వ్యాపారులకు వీలుంటుందని తెలిపింది. ముఖ్యంగా రూ.500 లోపు ప్రొడక్ట్‌‌లను అమ్మే సెల్లర్లు ప్రయోజనం పొందుతారని పేర్కొంది.  ఈ నిర్ణయం తాత్కాలికం కాదని 
తెలిపింది.