హైదరాబాద్ శివారులోని అన్నారం గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్ శివారులోని అన్నారం గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్ శివారులోని అన్నారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి  జిల్లా పరిధిలోకి వచ్చే అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లో బుధవారం (ఆగస్టు 06) ఫైర్ యాక్సిడెంట్ కారణంగా మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సిబ్బంది తెలిపారు. ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

భారీగా మంటలు ఒకదానికొకటి అన్నట్లుగా స్టోరేజీ సెంటర్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో విలువైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కాలిపోయింది. కోల్డ్ సోరేజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు, కూలింగ్ సిస్టం మొత్తం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. 

అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్, గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కోల్డ్ స్టోరేజీ సెంటర్ లో ఆహారం, విత్తనాలు, ఔషధాల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తోంది. వీటితో పాటు వ్యాక్సిన్ల కోసం క్రయోజనిక్ నిల్వ,  హీట్ -సెన్సిటివ్ ఫార్మా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి.