గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు

గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్ బీ నగర్ వైపు వస్తున్న ఓ కారు  గుర్రంగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి ఒక్కసారిగా బయటకు దూకాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. 

స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.