
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం(అక్టోబర్12) మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలోశ్రీలక్ష్మీ పవన్ ఎలక్ట్రికల్ , విజయలక్ష్మీ ఆటోమోటివ్ గోడైన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు భయంతో పరుగులు పెట్టారు.
ఈ ప్రమాదంలో ఎలక్ట్రకల్, ఆటోమోటివ్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 30లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.